రూ. 10కే ఎయిమ్స్లో వైద్యం.. వచ్చే ఏడాది ప్రారంభం: కిషన్ రెడ్డి

రూ. 10కే ఎయిమ్స్లో వైద్యం.. వచ్చే ఏడాది ప్రారంభం: కిషన్ రెడ్డి

అంబర్​పేట్, వెలుగు: పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్​పేట్ నియోజకవర్గంలోని కాచిగూడ, బాగ్ అంబర్​పేట్ డివిజన్లలో ఉన్న యూపీహెచ్​సీ సెంటర్లకు 13 రకాల వైద్య పరికరాలను శుక్రవారం ఆయన అందజేశారు. 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వైద్యం భరించలేని పేదల కోసం సనత్​నగర్​లోని ఈఎస్ఐ ఆసుపత్రిని బలోపేతం చేశామని, ప్రస్తుతం ఇక్కడ గాంధీ, ఉస్మానియా కంటే ఎక్కువ ఓపీ నమోదవుతోందని చెప్పారు.

బీబీనగర్​లో రూ. 1300 కోట్లతో నిర్మిస్తున్న ఎయిమ్స్​ను వచ్చే ఏడాది ప్రధాని మోదీ ప్రారంభిస్తారని, అక్కడ కేవలం రూ. 10కే నాణ్యమైన వైద్యం అందుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.