చేవెళ్ల, వెలుగు: సైకిల్ ట్రాక్ పై దశదిన కర్మ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్జాగూడ(నార్సింగి మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ చిన్నాన్న కోట వెంకటయ్య గౌడ్ గతవారం మృతి చెందాడు. అతని దశదినకర్మ కార్యక్రమాలను ఇంద్రనగర్ సమీపంలోని ట్రాక్ పై నిర్వహించారు.
దీనిపై సైక్లింగ్ ట్రాక్ నిర్వాహకులు అక్కడికి వెళ్లి, ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయవద్దని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. పైగా తాను గ్రామ సర్పంచినని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను ట్రాక్ నిర్వాహకులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పంపించేశారు. అనంతరం కేసు నమోదు చేశారు.

