ఇండ్లు కట్టుకునేందుకు రూ.10 వేల కోట్లు!

ఇండ్లు కట్టుకునేందుకు రూ.10 వేల కోట్లు!

హైదరాబాద్, వెలుగు: సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లకు ఆర్థికంగా సాయం చేసేందుకు బడ్జెట్‌‌‌‌లో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి అర్హులకు పంపిణీ చేసే విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భావించిన రాష్ట్ర సర్కారు బడ్జెట్‌‌‌‌లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు సాయం చేస్తామని పోయినేడాది బడ్జెట్‌‌‌‌ ప్రసంగంలోనే ప్రకటించినా.. నిధులు మాత్రం కేటాయించలేదు. అయితే ఈసారి బడ్జెట్‌‌‌‌లో రూ.10 వేల కోట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో డబుల్ ఇండ్ల కోసం అర్హులు నిలదీయడం, ఇష్టారీతిన ఇండ్లు కేటాయించడంతో రాష్ట్ర సర్కారుపై ప్రజలు విమర్శలు చేస్తున్నారు. దళితబంధుకు ఎంపిక చేసిన వారిలో కూడా ఎక్కువ మంది ఇండ్లు నిర్మించుకుంటామని కోరారు. దీంతో ఇంటి నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున సుమారు 2 లక్షల మందికి సాయం అందించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక ఉద్యోగ నోటిఫికేషన్లపై కూడా బడ్జెట్‌‌‌‌ ప్రసంగంలో సర్కార్‌‌‌‌‌‌‌‌ క్లారిటీ ఇవ్వనున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.