వనపర్తి, వెలుగు : నియోజకవర్గంలోని పలు గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం రూ.10.65 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖిల్లాగణపురం మండల బాలుర ఆశ్రమ పాఠశాలలో డార్మెటరీ, డైనింగ్ హాల్ నిర్మాణాలకు రూ.2 కోట్లు, వనపర్తి మండలం మర్రికుంటలోని ఎస్టీ గల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో డైనింగ్ హాల్, వంట గదుల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా రాజపేట శివారులోని ఎస్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో డైనింగ్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్నిర్మాణాలకు రూ.3 కోట్లు, అర్బన్ రెసిడెన్షియల్ బాయ్స్‌హాస్టల్ నిర్మాణానికి రూ.2.65 కోట్లు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వివరించారు. ఈ పనుల ప్రారంభానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.
