ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.14 లక్షలు మోసం

ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.14 లక్షలు మోసం

బషీర్​బాగ్, వెలుగు: ఆన్​లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ చీటర్స్ ఓ యువకుడిని మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. కాంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన యువకుడిని స్కామర్స్ వాట్సాప్ ద్వారా సంప్రదించారు. ఫైయర్స్ సెక్యూరిటీస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. నిజమని నమ్మిన అతను పెట్టుబడి పెట్టి రెండు దఫాలుగా రూ.3.60 లక్షల చొప్పున లాభాలను విత్ డ్రా చేసుకున్నాడు.

తర్వాత పూర్తి నమ్మకం కలగడంతో పలు దఫాలుగా మొత్తం రూ.17.94 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. వాటిని విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా.. ఇంకా పెట్టుబడి పెట్టాలని స్కామర్స్ ఒత్తిడి చేశాడు. ఆ యువకుడు ఇన్వెస్ట్​ చేయకపోవడంతో  అతన్ని బ్లాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మొత్తం రూ.14.34 లక్షలు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.