గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.100 కోట్ల చలాన్లు క్లియర్

గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.100 కోట్ల చలాన్లు క్లియర్
  • ఆఫర్‌‌‌‌తో పెండింగ్ చలాన్లు క్లియర్ చేస్తున్న వాహనదారులు

హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకుంటున్నారు. సర్కారు ప్రకటించిన ఆఫర్ మొదలైన రోజు నుంచి బుధవారం వరకు కోటి 30 లక్షల చలాన్లపై ఉన్న ఫైన్‌‌ను వాహనదారులు క్లియర్‌‌‌‌ చేశారు. ఆన్‌‌లైన్‌‌, పేమెంట్‌‌ గేట్‌‌వే, మీ సేవ సెంటర్స్‌‌ ద్వారా రూ.140 కోట్లు చెల్లించారు. ఇందులో గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనే సుమారు రూ.100 కోట్లు కలెక్ట్ అవ్వగా.. సిటీ కమిషనరేట్‌‌ పరిధిలో రూ.60 కోట్లు వసూలు చేశారు.

నెలాఖరుతో ముగుస్తున్న ఆఫర్

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌‌లో 6 కోట్లకు పైగా చలాన్లలో రూ.1,550 కోట్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. సర్కారు ఇచ్చిన ఆఫర్‌‌‌‌తో రూ.500 కోట్లకుగాను రూ.140 కోట్లు వసూలయ్యాయి. నెలాఖరుతో ఆఫర్‌‌‌‌ ముగియనుందని, ఆ సమయానికి పేమెంట్స్‌‌ ద్వారా రూ.800 కోట్లు కలెక్ట్ అవుతాయని భావిస్తున్నట్టు సిటీ జాయింట్‌‌ సీపీ ఏవీ రంగనాథ్‌‌ తెలిపారు. ఆఫర్‌‌‌‌ ముగిసిన తర్వాత పెండింగ్‌‌ చలానాలో ఉన్న మొత్తం అమౌంట్‌‌ చెల్లించాల్సిందేనని చెప్పారు.