ఆయిల్ రిజర్వ్ల ఏర్పాటుకు రూ.14,527 కోట్లు

ఆయిల్ రిజర్వ్ల ఏర్పాటుకు రూ.14,527 కోట్లు

న్యూఢిల్లీ:  ఇంధన భద్రతను బలోపేతం చేసేందుకు రూ. 14,527 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వులను విస్తరిస్తామని కేంద్రం లోక్‌‌‌‌సభలో వెల్లడించింది.  

ఒడిశాలో 40 లక్షల టన్నులు, కర్ణాటకలో 25 లక్షల టన్నుల సామర్థ్యంతో మొత్తం 65 లక్షల టన్నుల అదనపు ఆయిల్ స్టోరేజ్ నిల్వలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయంలో 60 శాతం వరకు ప్రభుత్వమే  వయబిలిటీ గ్యాప్ ఫండింగ్  కింద సమకూరుస్తుంది.  

ఇప్పటికే విశాఖపట్నం, మంగళూరు, పాదూరులలో కలిపి 53.3 లక్షల టన్నుల నిల్వ కేంద్రాలు ఉన్నాయి.