
కరోనా వైరస్ సోకి తమ రాష్ట్రంలో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 15 లక్షల ఆర్ధిక సాయం ఇస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. కరోనా వ్యాప్తి పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడానికి మీడియా ఎంతగానో కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టులు వార్తల సేకరణకు వెళ్లే సమయంలో కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడడంతో వారికి సహాయంగా ఆయా ప్రభుత్వాలు చేయుత నిస్తున్నాయని చెప్పారు. గతంలో హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు బీమా సౌకర్యం కూడా కల్పించింది.