డిఫెన్స్‌‌‌‌సెక్టార్‌‎లో రూ.1.80 లక్షల కోట్లు పెడతం: అదానీ గ్రూప్ కీలక ప్రకటన

డిఫెన్స్‌‌‌‌సెక్టార్‌‎లో రూ.1.80 లక్షల కోట్లు పెడతం: అదానీ గ్రూప్ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: ఇండియా డిఫెన్స్ సెక్టార్‌‎లో అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఎదుగుతోంది. తమ తయారీ సామర్ధ్యాలను పెంచుకునేందుకు 2026లో రూ.1.80 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. ముఖ్యంగా మానవ రహిత, అటానమస్‌‌‌‌ డిఫెన్స్ సిస్టమ్స్‌‌‌‌ను డెవలప్ చేయడానికి ఈ ఫంఢ్స్ వాడనుంది. అంతేకాకుండా  అడ్వాన్స్డ్‌‌‌‌ గైడెడ్ వెపన్స్‌, సెన్సర్లు, ఏఐతో పనిచేసే మల్టీ డొమైన్‌‌‌‌ ఆపరేషన్లపై అదానీ గ్రూప్ ఫోకస్ పెంచనుంది. విమానాల మెయింటెనెన్స్‌, రిపైర్ (ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఓ), ట్రెయినింగ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌విస్తరణపై కూడా దృష్టి పెట్టనుంది.

ఆపరేషన్ సిందూర్‌‎‌‌లో అదానీ డ్రోన్లు..?

అదానీ డిఫెన్స్ అండ్‌‌‌‌ ఏరోస్పేస్ ఈ ఏడాది అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌‌‌‌ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీగా ఎదిగింది. మానవరహిత ఏరియల్‌‌‌‌ (డ్రోన్లు), అండర్‌‌‌‌‌‌‌‌వాటర్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్స్‌‎‌ను, డ్రోన్లు వంటివి నడిపించే కంట్రోల్‌‌‌‌ స్టేషన్‌‌‌‌, కమ్యూనికేషన్ లింకులు, సెన్సర్లు, సాఫ్ట్‌‌‌‌వేర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. గైడెడ్‌‌‌‌ వెపన్లను, చిన్న తుపాకులను, మందుగుండు సామాగ్రిని తయారు చేస్తోంది. విమానాల ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఓ సర్వీస్‌‌‌‌లను,  ఎయిర్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్‌‌‌‌ (ఏడబ్ల్యూఏసీఎస్‌‌‌‌) ను అందిస్తోంది. 

అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి అన్‌‌‌‌మ్యాన్డ్‌ ఏరియల్ వెహికల్ (డ్రోన్ల)ను గూడచర్యం, పర్యవేక్షణ కోసం ఆపరేషన్ సిందూర్‌‎లో ఇండియన్ నేవీ, ఆర్మీ వాడిందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కంపెనీకి చెందిన కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ను ఆర్మీ, నావి, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌ క్లియర్‌‌‌‌‌‌‌‌ చేసిందని తెలిపారు. 

అగ్నికా వంటి సూసైడ్ డ్రోన్లను కూడా అదానీ గ్రూప్  తయారు చేస్తోందని, ఏడబ్ల్యూఏసీఎస్ సెగ్మెంట్‌‎లోకి ఎంట్రీ ఇచ్చిన ఏకైక ప్రైవేట్ కంపెనీ ఇదేనని అన్నారు. అదానీ గ్రూప్‌‌‌‌ "ఆర్కా మ్యాన్‌‌‌‌పాడ్స్‌‌‌‌ (భుజంపై మోసే క్షిపణి వ్యవస్థ)’’ ఆర్మీ, నావీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ కోసం  సిద్ధచేసింది.  ఎయిర్‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌, ఇండమెర్‌‌‌‌‌‌‌‌  విలీనంతో పెద్ద ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఓ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌గా  ఎదిగింది. ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌టీసీ (ఫ్లైట్ స్టిమ్యులేషన్ టెక్నిక్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌) కొనుగోలుతో పైలట్, ఇంజనీరింగ్ శిక్షణలో  విస్తరిస్తోంది.