V6 News

బ్లాక్ మనీ ఉన్నోళ్లకే  2 వేల నోటుతో మేలు: చిదంబరం

బ్లాక్ మనీ ఉన్నోళ్లకే  2 వేల నోటుతో మేలు: చిదంబరం

న్యూఢిల్లీ: రూ.2000 నోటు కేవలం బ్లాక్ మనీ ఉన్నవారికే ఉపయోగపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆరోపించారు. అవినీతి సొమ్మును వైట్ మనీగా మార్చడానికే కేంద్రం ఇప్పుడు 2 వేల నోటును వాపస్ తీసుకుంటోందన్నారు.  ‘రూ. 2 వేల నోటును మార్చుకోవడానికి ఐడీ ప్రూఫ్ అక్కర్లేదని బ్యాంకులు స్పష్టం చేశాయి. దీనివల్ల దేశంలో ని బ్లాక్ మనీని వెలికి తీయాలన్న కేంద్ర ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. రూ.2 వేల నోట్లు రోజువారీ కొనుగోళ్లకు ఉపయోగపడ ట్లేదు. మరి ఈ నోట్లు ఎవరి దగ్గరున్నాయి. ఇప్పటిదాకా ఎవరు వాడారు? మీ దగ్గర సమాధానం ఉందా.? ఈ నోటు కేవలం నల్లధనం కూడబెట్టుకోడానికే సాయపడింది. ఇప్పుడు ఆ బ్లాక్ మనీని వైట్​గా మార్చుకునేందు కు కేంద్రమే రెడ్ కార్పెట్‌‌ పరిచి స్వాగతం పలుకుతోంది. అందుకే ఐడీ ప్రూఫ్ అక్కర్లేదని చెబుతోంది’ అని చిదంబరం ట్వీట్ చేశారు.