కేజీ టమాటాతో.. ఐదు కేజీల బంగారం కొనొచ్చు..

కేజీ టమాటాతో.. ఐదు కేజీల బంగారం కొనొచ్చు..

కూరగాయలు ఎన్ని ఉన్నా వాటిలో టమాటా ప్రత్యేకత వేరు. దాదాపు అన్ని కూరల్లోనూ చాలామంది తప్పకుండా టమాటా వాడతారు. అందరూ అత్యధికంగా వినియోగించే కూరగాయ టమాటానే. ప్రస్తుతం దీని ధర ఆకాశాన్ని అంటింది. ఒక కిలో రూ.వంద దాటి సామాన్యుడు కొనేందుకు జంకేలా చేస్తోంది. ఒక్కోసారి కిలోకు రూపాయి ధర పడిపోయే టమాటా.. ఇప్పుడు ఎందుకు ఇంతలా మండిపోతోంది. ఏ కూర ఉండాలన్నా.. అందులో తప్పనిసరిగా టమాట చేర్చుతారు. కూర ఎక్కువ కావడం కోసం కొందరు.. రుచి పెరుగుతుందని ఇంకొందరు. గ్రేవీ కోసం కూడా మరికొందరు టమాటను చేర్చుతారు. 

ప్రస్తుత టమాటా ధరలు ఆకాశన్నంటుతున్నాయి. అనతికాలంలోనే దీని కిలోకు ధర రూ.100 దాటింది. భారతదేశంలో టమాటా పంట మార్చి, -ఏప్రిల్ నెలల్లో వేడి కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. దీని ఫలితంగానే టమాటా ధరలు విపరీతంగా పెరిగాయంటున్నారు వ్యాపారులు, రైతుులు. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాటా ధర రూ.100 పైనే ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టమాటా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. హజేరా (Hazera) జెనెటిక్స్ విక్రయించే టమోటా విత్తనాలు ఇప్పుడు యూరప్ మార్కెట్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి. ఇంతకీ ఈ విత్తనాల ధర ఎంత అని అనుకుంటున్నారా..? అది రూపాయో, వందో కాదు.. ఏకంగా కోట్లే అంటే నమ్మశక్యంగా లేదు కదా..కానీ, ఈ విత్తనాలకు జనాలు నిజంగా కోట్లు వెచ్చిస్తున్నారట. అత్యంత ఖరీదైన ఈ టమాటా విత్తనాల ఒక కిలో ప్యాకెట్ కు సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందట. అంటే ఈ డబ్బుతో ఐదు కిలోల బంగారాన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చన్న మాట. 

ఒక్క విత్తనంతో 20 కిలోల టమాటాలు

ఈ టమాటాలోని ఒక విత్తనం నుంచి దాదాపు 20 కిలోల టమాటాలు ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు. ఈ పండు కూడా చాలా ఖరీదైనది. ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ టమాటాలు ఒకసారి కొన్నవాళ్లు.. మళ్లీ మళ్లీ కొనేందుకు ఆసక్తి చూపిస్తారట.