
హైదరాబాద్, వెలుగు: ‘‘కరోనా కష్టాల్లో ఉన్నారా? బాధపడకండి, తక్కువ ఇంట్రెస్ట్ కే మీకు లోన్ ఇస్తం” అంటూ సైబర్ క్రిమిన్సల్ కాల్స్ చేసి.. అందినకాడికి దోచుకుంటున్నారు. సిటీలో నలుగురి నుంచి రూ.3.17 లక్షలు కొట్టేశారు. వెస్ట్ మారేడ్‌పల్లి లేపాక్షి కాలనీకి చెందిన ఇంటర్ స్టూడెంట్ హరిప్రీత్ సింగ్‌కి ఈ నెల 4న సిటీ ఫైనాన్స్ పేరుతో కాల్ వచ్చింది. రూ.43 లక్షల వరకు బిజినెస్ లోన్ ఇస్తామని నమ్మించి.. రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఫీజులంటూ రూ.1.25 లక్షలు కాజేశారు. పర్సనల్ లోన్ ఇస్తామంటూ చార్మినార్‌కి చెందిన రాజేశ్వర్ సింగ్ నుంచి రూ.78 వేలు వసూలు చేశారు. అంబర్‌పేటకు చెందిన ఇద్దరి నుంచి చంద్రశేఖర్ నుంచి రూ.లక్షా 14వేలు కొట్టేశారు. బాధితులు గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి