
న్యూఢిల్లీ: సినిమా, ఓటీటీ, టీవీ ఇండస్ట్రీలు గత ఏడాది (2024) రూ. 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాయి. ఈ రంగాల ద్వారా దాదాపు 26 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. డెలాయిట్‌తో కలిసి మోషన్ పిక్చర్ అసోసియేషన్(ఎంపీఏ) తయారు చేసిన రిపోర్టు ఈ విషయాలను వెల్లడించింది.
ముంబైలో జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్సమిట్(వేవ్స్)లో దీనిని విడుదల చేసింది. ప్రజలు వినోదం కోసం సినిమాలు చూడటానికి, టీవీ కార్యక్రమాలు చూడటానికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో ఈ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది.
2029 నాటికి ఎంటర్టైన్మెంట్సెక్టార్39 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని రిపోర్టు వెల్లడించింది. రాబోయే నాలుగేళ్లలో ఇండస్ట్రీ ప్రతి ఏటా ఆరు నుంచి ఏడు శాతం గ్రోత్ సాధించే అవకాశం ఉందని ఎంపీఏ చైర్మన్ చార్లెస్ రిక్విన్ చెప్పారు. 2029 నాటికి ఇండస్ట్రీ ఆదాయం రూ.1.65 లక్షల కోట్లకు చేరుతుందని వివరించారు.