కరోనా టెస్టు చేయమంటే.. 500 అడుగుతున్నారు

కరోనా టెస్టు చేయమంటే.. 500 అడుగుతున్నారు

సూర్యాపేట: పెన్ పహాడ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో కరోనా టెస్టులకు డబ్బులు వసూలు చేస్తున్నారు సిబ్బంది. కరోనా టెస్టు చేయడానికి అనధికారికంగా 5 వందలు వసూలు చేస్తున్నారు డాక్టర్ రాజేష్. టెస్టుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. కరోనా టెస్టు రిపోర్ట్ పాజిటివ్ వస్తే డబ్బులు తిరిగి ఇస్తామని.. నెగిటివ్ రిపోర్ట్ వస్తే డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. స్థానికులు అధికారుకు ఫోన్లు చేసినా.. వాట్సప్ లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు వాపోయారు. అయితే సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో కరోనా టెస్టుకు ఐదు వందలు అడిగిన డాక్టర్ క్రాంతి కుమార్ ఇష్యూపై జిల్లా అధికారులు స్పందించారు. వాట్సప్ లో తమకు వచ్చిన వీడియోపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. ఆరోపణలు నిరూపితమైతే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోట చలం.