ఏటీఎంలో రూ.6 లక్షలు చోరీ

ఏటీఎంలో రూ.6 లక్షలు చోరీ

కెమెరాలకు రంగేసి, గ్యాస్​కట్టర్​తో కట్​చేసి ఏటీఎంలో రూ.6 లక్షలు చోరీ
కుంట్లూర్​లో ఏటీఎం కొల్లగొట్టిన దొంగలు
కొన్ని నెలల క్రితం ఆదిబట్ల పీఎస్​లో ఇదే తరహా చోరీ
నార్త్​ఇండియా ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు నాలుగు టీంలతో వేట

హయత్ నగర్, వెలుగు: హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులోని గవర్నమెంట్​డిగ్రీ కాలేజ్​ ఎదురుగా ఉన్న యాక్సిస్ ఏ‌టీఎంలో చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు గ్యాస్ కట్టర్​తో మెషిన్​ను కట్​ చేసి అందులోని రూ.6లక్షలు ఎత్తుకెళ్లారు. హయత్​నగర్ పోలీసుల కథనం ప్రకారం..మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో ఏ‌టీ‌ఎం లో రూ.5లక్షలు ఫిల్ చేసి వెళ్లారు. అంతకుముందే అందులో లక్షకు పైగా క్యాష్​ ఉంది.

రాత్రి 1:59 నిమిషాలకు ఓ వ్యక్తి రూ.200 డ్రా చేశాడు. ఆ తర్వాత 2గంటల నుండి ఉదయం 4గంటల మధ్య ఈ చోరీ జరిగి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చోరీ..సీసీ కెమెరాల్లో రికార్డ్​అవ్వకుండా అవ్వకుండ మెషిన్​కు ఉన్న కెమెరాకు, రూంలో కెమెరాకు కలర్ వేశారు. తర్వాత కనెక్షన్ కట్ చేశారు. ఇన్వెస్టిగేషన్​ కోసం 4 టీంలను ఏర్పాటు చేశారు. కొన్ని నెలల క్రితం ఆదిబట్ల పీఎస్​పరిధిలో ఇదే తరహా చోరీ జరిగింది. ఈ కేసులో హర్యాణాకు చెందిన గ్యాంగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి డబ్బును స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ దొంగతనం కూడా ఉత్తరాది ముఠా చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. డబ్బులను పెట్టిన తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే దొంగతనం జరగడంతో అందులోని సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు