ఆర్టీసీ నష్టాల జర్నీ..2 నెలల్లో రూ.600 కోట్లు లాస్

ఆర్టీసీ నష్టాల జర్నీ..2 నెలల్లో రూ.600 కోట్లు లాస్
  • కరోనా ఎఫెక్ట్​తో బస్సులు ఎక్కని జనం
  • రోజుకు రూ. 2 కోట్లు మాత్రమే కలెక్షన్లు
  • అవి డీజిల్​కు కూడా సాల్తలేవంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్‌, వెలుగుఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్​ పడింది. లాక్​డౌన్​ సడలింపులతో బస్సులు స్టార్టయి రెండు నెలలు కావస్తున్నా సంస్థ ఇంకా గాడిన పడటంలేదు. బస్సుల్లో జర్నీపై ప్రయాణికులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. రెండు నెలల్లో రూ. 600 కోట్ల వరకు నష్టం జరిగినట్లు, రూ. 1,000 కోట్ల కలెక్షన్ కోల్పోయినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.రోజుకు రూ. 2 కోట్లు మాత్రమే కలెక్షన్ వస్తోందని,  ఇవి డీజిల్ ఖర్చులకూ సరిపోవట్లేదని చెబుతున్నారు.

ఓన్​ వెహికల్స్​కే జనం మొగ్గు

మార్చి 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే  పరిమితమయ్యాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది, అత్యవసర స్టాఫ్‌ కోసమే ఉపయోగించారు.  ఆ తర్వాత మే19 నుంచి గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌, ఇంటర్‌‌‌‌స్టేట్‌‌‌‌ బస్సులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బస్సులు నడిపిన రెండో రోజు, మూడో రోజు జనాలు బాగానే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత భారీగా తగ్గిపోయింది. బస్సుల్లో సీట్లు ఉన్నంత వరకు ప్రయాణికులను ఎక్కించుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. బస్సుల్లో నిండా జనం ఉంటే.. ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ అమలయ్యే పరిస్థితి ఉండదని భావించిన ప్రయాణికులు వాటిల్లో జర్నీకి వెనకాడుతున్నారు. సొంత వాహనాల్లోనే వెళ్తున్నారు.

సంస్థలో కరోనా కలకలం

ఇటీవల ఆర్టీసీలో పలువురికి కరోనా రావడం కలకలం రేపుతోంది. బస్‌భవన్‌లో ఓ సీనియర్​ ఆఫీసర్​కు కరోనా సోకగా..ఇప్పుడు డిపోల్లో ఉన్నవారికీ పాజిటివ్  రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా 30 మంది వరకు ఆర్టీసీ స్టాఫ్​కు కరోనా సోకగా.. నలుగురు మరణించారు. ఇటీవల పాజిటివ్​ వ్యక్తులు బస్సుల్లో ప్రయాణించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో జనం భయపడుతున్నారు.

రోజుకు రూ. 2 కోట్లు వస్తలేవ్

రాష్ట్రంలో 10, 460 బస్సులు ఉండగా.. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌  సడలింపుల తర్వాత నడపడానికి 6,500 బస్సులను రెడీ  చేశారు. ఇందులో సిటీ, ఇంటర్‌‌‌‌ స్టేబ్‌‌‌‌ బస్సులు పోగా.. ఆక్యుపెన్సీ లేకపోవడంతో ప్రస్తుతం 3,500 నుంచి 3,800 వరకు బస్సులు నడుపుతున్నారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40% లోపే ఉంటోంది. దీంతో రోజుకు రూ. 2 కోట్ల నుంచి 2.5 కోట్ల కలెక్షన్‌‌‌‌ కూడా రావడంలేదు. కరోనాకు ముందు సాధారణంగా ఆర్టీసీకి రోజుకు రూ. 12 కోట్ల నుంచి 13 కోట్లు వచ్చేది. డీజిల్ రేట్లు పెరగడంతో వచ్చిన రూ. 2 కోట్లూ దానికే సరిపోవట్లేదని అధికారులంటున్నారు.

జూన్లో కలెక్షన్ రూ. 107 కోట్లే

లాక్​డౌన్​ సడలింపుల తర్వాత ఆర్టీసీ బస్సులు స్టార్టయినప్పటి నుంచి రెండు నెలల్లో రూ. 600 కోట్ల వరకు సంస్థకు నష్టం వచ్చినట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. మే 19 నుంచి ఇప్పటి దాకా రూ. 1,000 కోట్ల వరకు కలెక్షన్ కోల్పోయినట్లు చెబుతున్నారు. మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు అస్సలే నడవలేదు. కరోనా కంటే ముందు ఆర్టీసీకి నెలకు రూ. 350 కోట్ల కలెక్షన్ వచ్చేది. జూన్ నెలలో రూ. 107 కోట్లు మాత్రమే వచ్చింది. నెలకు రూ. 300 కోట్లు జీతాలు, ఇతర అవసరాలకు ఖర్చు అవుతోందని ఆఫీసర్లు వివరిస్తున్నారు. వీటి వల్ల మే 19 నుంచి ఇప్పటి వరకు రూ. 600 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు చెబుతున్నా రు.

వారం ,పది రోజుల్లో  టీవీ బడులు షురూ