500 కిలోమీటర్లకు 7 వేల 500 రూపాయలు మాత్రమే: విమాన టికెట్లపై కేంద్రం గైడ్ లైన్స్

500 కిలోమీటర్లకు 7 వేల 500 రూపాయలు మాత్రమే: విమాన టికెట్లపై కేంద్రం గైడ్ లైన్స్

విమానాల రద్దు, ప్రయాణికుల ఇబ్బందులు దేశంలో  ఐదురోజులుగా  ఇండిగో సంక్షోభం తర్వాత కేంద్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంది.  మరో మూడు రోజుల్లో  విమానాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని,  అప్పటి వరకు ప్రయాణికులనుంచి ఎటువంటి అదనపు ఫీజుల వసూలు చేయొద్దని, ఫ్లైట్ల క్రైసిస్ తో విమానాల టికెట్ ధరలు పెంచకుండా  పరిమితులు విధిస్తూ విమానయాన సంస్థలకు గైడ్ లైన్స్ జారీ చేసింది.

విమాన టికెట్ ధరలపై ఇండిగో తో సహా ఇతర డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ సంస్థలకు  గైడ్ లైన్స్ విడుదల చేసింది.. 500 కిలోమీటర్లు రూ. 7వేల 500 లు, 1000 కి.మీ. వరకు గరిష్ఠ ధర రూ.12 వేలు,  -1500 కి.మీ. వరకు గరిష్ఠ ధర రూ.15 వేలు,  1500 కి.మీ. దాటితే గరిష్ఠ ధర రూ.18 వేలు గా నిర్ణయించింది. చార్జీల పరిమితులు బిజినెస్ క్లాస్, RCS ,UDAAN విమానాలకు వర్తించవని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి అంతకంటే ఎక్కువ వసూలు చర్యలు తప్పవని హెచ్చరించింది.  

దీంతోపాటు 24 గం టల్లో ప్రయాణికులకు పెండింగ్ లో టికెట్ డబ్బులు తిరిగి ఇవ్వాలని, 48 గంటల్లో లగేజీని వారి ఇంటికి డెలివరీ చేయాలని ఆదేశించింది. ఇండిగో సంక్షోభంతో దేశంలో పెరిగిన ధరలను అరికట్టేందుకు ఛార్జీల లిమిట్స్ ను విధించింది. 24 గంటల్లోపు విమానాల రాకపోకలు సాధారణ స్థితికి వస్తాయని, మరో మూడు రోజుల్లో పూర్తి్ స్థాయిలో విమానాలు అందుబాటులో వస్తాయని   పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.