సివిల్ సప్లై శాఖకు రూ.7,366 కోట్లు

సివిల్ సప్లై శాఖకు రూ.7,366 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో సివిల్ ​సప్లై శాఖకు రూ.7,366 కోట్లు కేటాయించింది. నిరుడు రూ.5,734 కోట్లు మాత్రమే పెట్టారు. అర్హులైన పేద కుటుంబాలకు 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. పాత కార్డుల్లో 19.44 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్​ కార్డుల సంఖ్య 1,05,07,879కి చేరింది. 

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సబ్సిడీకి రూ.3 వేల కోట్లు  కేటాయించింది. గ్యాస్​ సబ్సిడీకి రూ.723 కోట్లు, రైతుల నుంచి సేకరించే ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వడానికి రూ.3,500 కోట్లు, శాఖాపరమైన ఖర్చులు, సిబ్బంది వేతనాలు, గోడౌన్ల నిర్వహణకు రూ.143 కోట్లు కేటాయించారు.