నాగర్‌కర్నూల్, వెలుగు : కల్వకుర్తి లిఫ్ట్స్కీమ్ పెండింగ్‌పనులు పూర్తి చేయడానికి రూ. 785 కోట్లు అవసరమని ఇరిగేషన్ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి రిపోర్ట్అందజేశారు. కల్వకుర్తి కింద ప్రస్తుతం 3.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అదనంగా 86 వేల ఎకరాలకు సాగునీరందించి స్థిరీకరించాలని నిర్ణయించారు.
ఈ స్కీమ్‌కు సంబంధించి భూసేకరణ, పెండింగ్ పనులు, 29వ ప్యాకేజీ పనులు, 30వ ప్యాకేజీ విస్తరణ, ఎల్లూరు పంప్‌హౌజ్‌లో దెబ్బతిన్న రెండు పంపులు,హెడ్‌రెగ్యులేటర్ రిపేర్లకు దాదాపు రూ.785 కోట్లు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆన్గోయింగ్ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ రిపోర్ట్ పంపారు.
కొత్తగా 86 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్లాన్
కల్వకుర్తి లిఫ్ట్ స్కీం కింద నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నల్గొండ జిల్లాల పరిధిలో 3.65 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుంది. మరో 86 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆఫీసర్లు ప్రతిపాదనలు సిద్దం చేశారు. కొల్లాపూర్మండలం రేగుమానుగడ్డ వద్ద ఎల్లూరు పంప్హౌజ్అప్రోచ్కెనాల్కు ముందు హెడ్‌రెగ్యులేటరీ నిర్మించాల్సి ఉండగా దాన్ని పక్కకు పెట్టారు. ఎల్లూరు పంప్హౌజ్రెండుసార్లు మునిగిపోగా ఒక పంప్ పూర్తిగా, మరో పంపు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ఈ పంపులు, మోటర్ల రిపేర్లకు రూ.20 కోట్లు, పంప్‌హౌజ్‌పై వరద ఒత్తిడి నియంత్రించేందుకు హెడ్‌రెగ్యులేటరీ నిర్మాణానికి రూ.30 కోట్లతో ప్రపోజల్స్రెడీ చేశారు. 29వ ప్యాకేజీ, డీ82 కాలువ కింద దాదాపు 2.18లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. మెయిన్ కెనాల్తోపాటు బ్రాంచ్ కెనాల్స్, మైనర్లు, స్ట్రక్చర్ల నిర్మాణానికి దాదాపు రూ.600 కోట్లు అవసరమని అంచనా వేశారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట నియోజకవర్గాలకు సాగునీరందించే 30 వ ప్యాకేజీ విస్తరణకు రూ.35 కోట్లు అవసరం అవుతాయని, రెండు ప్యాకేజీల కింద భూసేకరణకు మరో రూ.100 కోట్లు అవసరమని అంచనా వేశారు.
