వ్యక్తి మర్డర్ కు రూ.9 లక్షల సుపారీ ..హత్య కుట్రను భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు

వ్యక్తి మర్డర్ కు రూ.9 లక్షల సుపారీ ..హత్య కుట్రను భగ్నం చేసిన మైలార్ దేవ్ పల్లి పోలీసులు

శంషాబాద్, వెలుగు: ఓ వ్యక్తిని  మర్డర్​ చేసేందుకు సుపారీ గ్యాంగ్​తో రూ.9 లక్షలకు బేరం కుదుర్చుకోగా వారి కుట్రను మైలార్​దేవ్​పల్లి పోలీసులు భగ్నం చేశారు. ఇన్​స్పెక్టర్ నరేందర్ తెలిపిన ప్రకారం.. వట్టిపల్లికి చెందిన ఓ వ్యక్తికి, ఇమ్రాన్ ఖాన్‌, యాసిన్ కు సెకండ్​ హ్యాండ్​ వెహికల్స్​ బిజినెస్​లో భాగస్వామ్యం ఉండేది. వీరి మధ్య వివాదాలు తలెత్తి విడిపోయారు. ఏడాది క్రితం షేక్ ఆమెర్, మహ్మద్ సోహైల్ తో పాటు మరికొందరు ఇమ్రాన్ ఖాన్‌ ఇంటిపై దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. 

వట్టిపల్లికి చెందిన వ్యక్తే ఈ ఘటనకు సూత్రధారి అని ఇమ్రాన్ ఖాన్ అనుమానించాడు. ఆయనను చంపేందుకు ఇబ్రహీం, సైఫ్, శ్రీరామ్, షాబాజ్, షయాబ్, బవాజిర్‌ తో డీల్​ కుదుర్చుకున్నాడు. రూ.9 లక్షలు ఇస్తానని చెప్పి, అడ్వాన్స్​గా ఐదుగురుకి రూ.60 వేలు ఇచ్చాడు. ఇందులో శ్రీరామ్ అనే వ్యక్తి ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు. 

వీరంతా పథకం  ప్రకారం మంగళవారం వట్టేపల్లి నైస్ హోటల్ కు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు. రూ.10 వేలు, 2 మొబైల్ ఫోన్ లు, 2 బైక్​లు, కత్తులు స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు.