వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర పలికింది. గత రికార్డులను తిరగరాస్తూ… ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. దేశీ రకం మిర్చికి ఏనుమాముల మార్కెట్ లో క్వింటాల్ కు రూ. 44,000 ధర పలికింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు నాగేశ్వర్ రావు తీసుకువచ్చిన దేశీరకం మిర్చిని జితిన్ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్ రూ. 44 వేలు చెల్లించి కొనుగోలు చేసింది. కొద్ది రోజుల క్రితం మిర్చి క్వింటాల్ రూ.37 వేలు పలుకగా... ఇప్పుడు ధర మరింత పెరగడంతో మిర్చి రైతులు పండగ చేసుకుంటున్నారు. కాగా.. పత్తికి కూడా రికార్డ్ ధర పలుకుతోంది. క్వింటాల్ పత్తి ధర రూ. 10,500 పైనే పలుకుతోంది.
మరిన్ని వార్తల కోసం:
