మూడేండ్లలోనే కాళేశ్వరం కథ ముగిసింది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మూడేండ్లలోనే కాళేశ్వరం కథ ముగిసింది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కథ ముగిసిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సదర్మట్ బ్యారేజ్ నిర్మించి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును సందర్శించిన ఆర్ఎస్పీ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో నాణ్యతాలోపం ఉందని ఆరోపించారు. వరదల కారణంగా  కడెం ప్రాజెక్టు రైతులు చాలా నష్టపోయారని అన్నారు. పరిహారంపై సర్వేలు నిర్వహించినా ఇప్పటి వరకు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్ బాట పడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు.. అక్కడ కొందరు జీతాలు చాలక ఇబ్బందులు పడుతుంటే మరికొందరు ఏజెంట్ల మోసానికి జైళ్లలో మగ్గుతున్నారని అన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  మండిపడ్డారు. కొండగట్టు ప్రమాదంలో 60 మంది చనిపోతే బాధిత కుటుంబాలను కేసీఆర్ ఇప్పటి వరకు పరామర్శించలేదని విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత అనుచరుల ఒత్తిడి కారణంగానే రైతు ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్ అయ్యారు.