గ్రూప్1 స్కామ్.. సీబీఐకి అప్పగించాలి..రేవంత్ రెడ్డి వల్లే గ్రూప్ 1 రద్దు: ఆర్ఎస్ ప్రవీణ్

గ్రూప్1 స్కామ్.. సీబీఐకి అప్పగించాలి..రేవంత్ రెడ్డి వల్లే గ్రూప్ 1 రద్దు: ఆర్ఎస్ ప్రవీణ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 పరీక్షల నిర్వహణ, ఫలితాలు స్కామ్ అని, దాని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వల్లే గ్రూప్1 రద్దు అయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. గ్రూప్1 అభ్యర్థులతో కాంగ్రెస్ మంత్రులు బేరసారాలకు దిగారన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.3 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇది అతిపెద్ద కుంభకోణమన్నారు. 

బుధవారం ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ భవన్​లో మీడి యాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​, బీఆర్ఎస్​ నేతలతో కలిసి టీజీపీఎస్సీకి వెళ్లి గ్రూప్1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని సెక్రటరీ ప్రియాంక ఆలకువినతిపత్రం అందజేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నందుకు గ్రూప్1 స్కామ్​పై సీబీఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. అర్హతలేని వ్యక్తులతో పేపర్లను దిద్దించారని ఆరోపించారు. లక్షలాది మంది యువత భవిష్యత్​ను సీఎం రేవంత్​ రెడ్డి నాశనం చేశారన్నారు.