
ఐఏఎస్ అధికారి షేక్ యాస్మిన్ ను ఆసిఫాబాద్ కలెక్టర్ కాకుండా సిర్పూరు ఎమ్మెల్యే కోనప్ప అడ్డుకున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. నీతి నిజాయితీగా పని చేసే షేక్ యాస్మిన్ ను కోనప్ప ఒత్తిళ్లకు లొంగి ఆసిఫాబాద్ కలెక్టరు కాకుండా ఆర్డరు కాన్సిల్ చేశారని ఆరోపించారు. సిర్పూరు ప్రాంతాన్ని కోనప్ప కబందహస్తాల నుండి విముక్తి చేసి తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
నిన్న ఐఏఎస్ అధికారి షేక్ యాస్మిన్ ను వనపర్తి నుంచి ఆసిఫాబాద్ కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ ఇవాళ ఉదయం జగిత్యాల కలెక్టర్ గా షేక్ యాస్మిన్ భాషను నియమిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి కలెక్టర్ గా ఉన్న షేక్ యాస్మిన్ జగిత్యాలకు.. మంచిర్యాల కలెక్టర్ గా బదిలీ అయిన బడావత్ సంతోష్ కు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.