రైతులకు పంటనష్టం పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు

రైతులకు పంటనష్టం పరిహారం ఎందుకు ఇవ్వడం లేదు

అయిజ, వెలుగు: రాష్ట్రంలో వడగండ్ల  వాన వల్ల  పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, నేటికీ ఎందుకు ఇవ్వడం లేదని బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం బహుజన రాజ్యాధికార యాత్ర 212వ రోజు జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీలో జరిగింది. ఈసందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ..ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు ఇస్తామని చెప్పి, ఆదుకోవడంలో బీఆర్​ఎస్​ సర్కార్​ విఫలమైందని విమర్శించారు.

హామీలు మాత్రమే ఇచ్చి  రైతులను మభ్యపెడుతోందన్నారు.  వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలోని పల్లెలన్నీ  ఏకమై నిర్ణయం తీసుకుని బీఎస్పీ గెలిపించాలని కోరారు.  యాత్రలో జిల్లా అధ్యక్షుడు  కేశవరావు, నియోజకవర్గ అధ్యక్షుడు  మహేశ్​, నియోజకవర్గ ఇంచార్జి మధు గౌడ్,జనరల్ సెక్రటరీ కనకం బాబు తదితరులు పాల్గొన్నారు.