టీచర్ల కన్నీళ్లు తుడవాలి

టీచర్ల కన్నీళ్లు తుడవాలి

కేసీఆర్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేడర్​ విభజన కోసం ఈ నెల 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో 317ను తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి వివాదం ముదురుతూనే ఉంది. స్థానికత అంశమే ఇందులో లేకపోవడం, ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా సీనియారిటీ లిస్టులు ప్రిపేర్​ చేయడం, అంతర్ జిల్లా బదిలీలు, స్పౌజ్ కేసులపై క్లారిటీ ఇవ్వకపోవడంపై  టీచర్లు, ఎంప్లాయీస్ భగ్గుమంటున్నారు. జీవోలోని అంశాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు. జూనియర్​ ఉద్యోగులైతే తాము స్థానికతను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఉద్యోగులు, టీచర్ల కన్నీలు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.    

పండగ పూట ఆనందంగా కుటుంబాలతో గడపాల్సిన ఉపాధ్యాయులు కన్నీళ్లతో భార్యాభర్తలు ఒక్కచోటే పనిచేసే న్యాయమైన హక్కు కోసం పాఠశాల విద్యా కమిషనర్ ఆఫీసు దగ్గర ధర్నా చేయడం నిజంగా గుండెను పిండివేసిందంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇద్దరు టీచర్ల బిడ్డగా వీళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని అర్థం పూర్తిగా చేసుకోగలను అని అన్నారు. తెలంగాణ భావి తరాల మీద ప్రేమ ఉన్న ఏ పాలకుడైనా ఉద్యోగుల, ప్రత్యేకించి గురువుల కళ్లలో కన్నీళ్లు చూడాలని అనుకోడన్నారు. మరి ఇక్కడ జరుగుతున్నదేంది? ముఖ్యమంత్రి గారి దర్శన భాగ్యం తెలంగాణకు ఎలాగూ లేదు.. కనుక అధికారులైనా స్పందించాలి, ఈ కన్నీళ్లు తుడవాలంటూ ట్వీట్ చేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

https://twitter.com/RSPraveenSwaero/status/1480488301903572995

మరిన్ని వార్తల కోసం..

రాష్ట్రాన్ని కేసీఆర్ చావుల కాష్టంగా తయారు చేసిండు