
రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం సంతోషకరమని బీఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందలాదిరోజులు పోరాడరని ఆయన గుర్తు చేశారు. కేంద్రం మెడలు వంచిన అన్నదాతలకు ఆయన జేజేలు తెలిపారు.
‘రైతు వ్యతిరేక చీకటి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం ప్రకటించడం సంతోషకరం. గత వందలాదిరోజులుగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన అన్నదాతలకు జేజేలు’ అని ఆయన ట్వీట్ చేశారు.
రైతు వ్యతిరేక చీకటి చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కేంద్రం ప్రకటించడం సంతోషకరం. గత వందలాదిరోజులుగా ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన అన్నదాతలకు జేజేలు.??????
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) November 19, 2021