
హైదరాబాద్, వెలుగు: తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తిస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్య క్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన చింతల్ బస్తీ కమ్యూనిటీ హల్ లో జరిగిన జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల గోస సమావేశానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చి, మురికి కాలువల్లోని చెత్తాచెదారాన్ని నెత్తికెత్తు కునే పేదల కష్టాలు కేసీఆర్కు పట్టవని విమర్శించారు.
పారిశుద్ధ్య కార్మికుల శ్రమకు తగ్గ ప్రతిఫలం అందించడంలో బీఆర్ఎస్ విఫలం అయ్యిందని తెలిపా రు. ట్విట్టర్ ద్వారా అబద్ధాలు ప్రచారం చేసే కేటీఆర్ కు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు ఏమిటో తెలియవన్నారు. ఫొటోల కోసమే ప్రధాని మోదీ చీపురు పట్టుకొని పోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని కార్మి కుల కుటుంబాలను పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు ఈఎస్ఐ వైద్యం అందించడంలో ప్రభుత్వం ఫెయిలైందని మండిపడ్డారు.