అమరుల స్థూపం కాడ్కి రండి.. లీకు ఆధారాలతో వస్తా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

అమరుల స్థూపం కాడ్కి రండి.. లీకు ఆధారాలతో వస్తా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TSPSC పేపర్ లీక్ పై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ మంగళవారం హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో ఏర్పాటు చేసిన నిరుద్యోగ భరోసా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. TSPSC పేపర్ ను వ్యాపారంగా మర్చి అమ్ముకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ దమ్ముంటే..అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని.. తాను పేపర్ లీక్ కు సంబంధించిన ఆధారాలతో వస్తానని ప్రవీణ్ కుమార్ సవాల్ చేశారు. గ్రూప్ 1కు సంబంధించిన అన్నీ పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.

సిట్ ద్వారా నిరుద్యోగులకు న్యాయం జరగదని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం ఉన్న TSPSC బోర్డును ప్రక్షాళన చేయకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మళ్లీ మళ్లీ మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యమంత్రి కేసీఆర్ పేపర్ లీక్ పై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రే దోషి అని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం  కొనసాగుతుందని హెచ్చరించారు.