జనవరి 15 నుంచి ఆర్​ఎస్​ ప్రవీణ్​ యాత్ర

జనవరి 15 నుంచి ఆర్​ఎస్​ ప్రవీణ్​ యాత్ర
  • ఆర్​ఎస్​ ప్రవీణ్​ యాత్ర  
  • 100 రోజుల చొప్పున మూడు విడతలుగా టూర్​

హైదరాబాద్, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ కో ఆర్డినేటర్  ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. పార్టీ నేషనల్​ ప్రెసిడెంట్​మాయావతి బర్త్​డే అయిన జనవరి 15న ఉమ్మడి వరంగల్​జిల్లా నుంచి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. సర్దార్​సర్వాయి పాపన్నగౌడ్​పుట్టిన ఊరైన ప్రస్తుత జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి టూర్​ స్టార్ట్​ చేయనున్నారు. 100  రోజుల చొప్పున మూడు విడతలుగా మొత్తం 300 రోజులపాటు ప్రవీణ్​ టూర్​ కొనసాగనుంది. తొలిదశలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్,​ ఖమ్మం జిల్లాల్లో యాత్ర చేస్తారు. వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో ఈ టూర్ కొనసాగనున్నట్లు బీఎస్పీ వర్గాలు తెలిపాయి. టూర్​ పూర్తయ్యాక​హైదరాబాద్​లో 10 లక్షల మంది బహుజనులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెబుతున్నాయి.  జనవరి 15  కల్లా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్​కు కనీసం 1,500–2,000 చొప్పున మొత్తం రెండు లక్షల మెంబర్​షిప్ చేయించాలనే లక్ష్యంతో కేడర్​పని చేస్తోందని ఆర్ఎస్​పీ సెక్రటరీ మల్లికార్జున్​ తెలిపారు.