కేటీఆర్ కామెంట్స్పై ప్రవీణ్ కుమార్ సెటైర్లు

 కేటీఆర్ కామెంట్స్పై  ప్రవీణ్ కుమార్ సెటైర్లు

ముమ్మాటికి తమది కుటుంబ పాలనేనని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది తమ కుటుంబ సభ్యులేనని అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన  కామెంట్స్ పై బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.  మొత్తం తెలంగాణ మీ కుటుంబమా? బాగానే చెప్పారంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. మరి అదే నిజమైతే మరి ఆస్తులు, ఫాంహౌసులు,  సౌత్ గ్రూప్ లాంటి బినామీలు, రూ.100కోట్లు, కాంట్రాక్టులు,హెలీకాప్టర్లు, మెడికల్ కాలేజీలు, ఫారిన్ టూర్లు అన్నీ కేవలం మీ కుటుంబీకులకే ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. మిగతా తెలంగాణ కుటుంబీకులకు ఎందుకు లేవు? అని ఆయన ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.  రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలకు కేటీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. తమది ముమ్మాటికీ కుటుంబపాలనే అన్నారు. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు తమ కుటుంబసభ్యులేనన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆ కుటుంబానికి పెద్దని చెప్పారు. అందుకే కుటుంబపాలన అంటున్న  ప్రతిపక్షాల విమర్శల్ని తాము స్వీకరిస్తామని అన్నారు.