Naveen Polishetty: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నవీన్ పోలిశెట్టి.. బడా నిర్మాతలకు షాకింగ్ షరతులు!

Naveen Polishetty: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన నవీన్ పోలిశెట్టి.. బడా నిర్మాతలకు షాకింగ్ షరతులు!

నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ పేరు ఒక సెన్సేషన్. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ"తో మెప్పించి, "జాతి రత్నాలు"తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ యంగ్ హీరో, తాజాగా సంక్రాంతి బరిలో 'అనగనగా ఒక రాజు' చిత్రంతో వచ్చి మరోసారి సత్తా చాటాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, సంక్రాంతి లాంటి టఫ్ కాంపిటీషన్‌లోనూ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

సంక్రాంతి విన్నర్ గా!

ఈ ఏడాది సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ, నవీన్ తనదైన 'క్లీన్ కామెడీ', 'ఫ్యామిలీ ఎమోషన్స్'తో బాక్సాఫీస్ వద్ద అసలైన విజేతగా నిలిచాడు. థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను రప్పించడంలో ఈ సినిమా సక్సెస్ కావడంతో, నవీన్ మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన నవీన్ కోసం అగ్ర నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే మార్కెట్ పెరగడంతో నవీన్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు ఆయన రెండు కఠినమైన షరతులు విధిస్తున్నారట. అవే ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ గా మారాయి..

నిర్మాతలకు నవీన్ కండిషన్స్!

 ఇప్పటివరకు తక్కువ బడ్జెట్ సినిమాలతో భారీ లాభాలు తెచ్చిపెట్టిన నవీన్.. ఇకపై తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. ఒక్కో సినిమాకు రూ. 15 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. నవీన్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయన్న నమ్మకంతో నిర్మాతలు కూడా దీనికి సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. . ఇక అన్నిటికంటే ముఖ్యమైన షరతులలో సినిమా కథ, స్క్రిప్ట్, ఎడిటింగ్ , ప్రమోషన్స్ ఇలా ప్రతి విషయంలోనూ తన నిర్ణయమే ఫైనల్ కావాలని కోరినట్లు సమాచారం. మేకింగ్‌లో నిర్మాత లేదా ఇతరుల జోక్యం అస్సలు ఉండకూడదని నవీన్ షరతులు పెట్టినట్లు టాక్.. ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ పక్కాగా ఉండాలని నమ్మే నవీన్, పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

 రూట్ మారుస్తున్నారా?

సాధారణంగా పెద్ద హీరోలు మాత్రమే ఇలాంటి షరతులు పెడుతుంటారు. కానీ నవీన్ తనకున్న 'క్రియేటివ్ బ్రెయిన్'తో సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించగలననే నమ్మకంతో ఈ కండిషన్స్ పెట్టినట్లు టాక్. తన గత చిత్రాల విషయంలో కూడా నవీన్ స్క్రిప్ట్ వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఫలితాన్ని సాధించారు. అందుకే ఇప్పుడు అధికారికంగా ఈ నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి నవీన్ పోలిశెట్టి పెట్టిన ఈ కండిషన్స్ చూస్తుంటే, ఆయన కేవలం హీరోగా మాత్రమే కాకుండా, సినిమాను ఒక బ్రాండ్గా మార్చే పనిలో ఉన్నట్లు అర్థమవుతోంది. మరి ఈ 15 కోట్ల డీల్‌కు, నవీన్ రూల్స్ కు ఏ ఏ బడా నిర్మాతలు ఓకే చెబుతారో వేచి చూడాలి!