రూ.20 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

V6 Velugu Posted on Jun 21, 2021

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉదయం టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ ను పట్టుకున్నారు DRI అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు 20  కోట్ల విలువ చేసే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేదానిపై నిందితుడిని ఆరాతీస్తున్నారు.

శంషాబాద్ లో భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడం ఈనెలలో ఇది రెండోసారి. ఈనెల 5న జాంబియాకు చెందిన ఇద్దరు మహిళల నుంచి 78 కోట్ల విలువైన హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. వరుసగా విదేశాల నుండి డ్రగ్స్ పట్టుబడడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు ఆధికారులు . 
 

Tagged , Rs.20 crores, drugs seize, Shamshabad Airport

Latest Videos

Subscribe Now

More News