సైబర్ నేరగాళ్ల కుచ్చు టోపీ... రూ.7.5లక్షలు గాయబ్

సైబర్ నేరగాళ్ల కుచ్చు టోపీ... రూ.7.5లక్షలు గాయబ్

రోజురోజుకూ టెక్నాలజీ ఎల్లలు దాటుతోంది. దాంతో పాటు అక్రమాలూ ఎక్కువైతున్నాయి. దీనిపై పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తరహా మోసమే కామారెడ్డి జిల్లాలో జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.7.5 లక్షలు కాజేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన కల్ల లచ్చయ్యకు ఈనెల 9న సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దుబాయ్ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పంపిస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు చెప్పిన మోసపూరిత మాటల్ని లచ్చయ్య గమనించలేకపోయాడు. అందుకోసం డబ్బులు చెల్లించాలంటూ దుండగులు చెప్పడంతో విడాతల వారీగా రూ.57,000 , రూ.90,000, రూ.27,000 రూపాయలను ఆన్ లైన్ ద్వారా వారి అకౌంట్ కు లచ్చయ్య చెల్లించాడు. 

అనంతరం పార్సిల్ ద్వారా దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తువులు వచ్చాయని రూ. 4, 29,000 రూపాయలు అకౌంట్ లో జమ  చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచించారు. దీంతో లచ్చయ్య ఆ అమౌంట్ ను జమ చేశాడు. అంటే మొత్తం కలిపి రూ.7,50,000 రూపాయలను లచ్చయ్య, సైబర్ నేరగాళ్లకు పంపాడన్నమాట. తిరిగి వారి ఫోన్ నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన లచ్చయ్య... సైబర్ క్రైమ్ నంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం స్థానిక బీబీపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న బీబీపేట పోలీసులు...  దర్యాప్తు చేపట్టారు.