రెండో రోజూ స్కూల్ బస్సులపై కొరడా.. మొత్తం 52 కేసులు నమోదు.. 15 బస్సులు సీజ్

రెండో రోజూ స్కూల్ బస్సులపై కొరడా..  మొత్తం 52 కేసులు నమోదు.. 15 బస్సులు సీజ్

హైదరాబాద్ సిటీ/గండిపేట, వెలుగు: గ్రేటర్​ పరిధిలో ఫిట్​నెస్​లేని ప్రైవేట్​స్కూల్, కాలేజీల బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. విద్యాసంస్థలు ప్రారంభమైన గురువారం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన అధికారులు బస్సులను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిట్​నెస్​ లేని, ఓవర్​లోడ్​తో వెళ్తున్న, సరైన పత్రాలు లేని, 60 ఏండ్లు దాటిన డ్రైవర్లు నడుపుతున్న 15 బస్సులను సీజ్​చేసి 52 కేసులు నమోదు చేశారు. 

వికారాబాద్: వికారాబాద్​లో ఫిట్​ నెస్​ లేని రెండు స్కూల్​ బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తనిఖీల్లో భాగంగా రెండు బస్సులకు ఫిట్​నెస్​ లేకపోవడంతో కేసు నమోదు చేసి,  ఒక్కో బస్సుకు రూ.5 వేల చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్​ రెడ్డి తెలిపారు.