హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓవర్‌లోడ్‌తోపాటు అతివేగంగా వెళ్లే వాహనాల తనిఖీని ఆర్టీఏ అధికారులు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా నాలోల్ వద్ద అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 20 టన్నుల డస్ట్‌ను తీసుకు వెళ్తున్న ఓ లారీని అధికారులు సీజ్ చేశారు. అలాగే 13 టన్నులతో వెళ్తున్న వాహనం, 9 టన్నుల స్టీల్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని కూడా అధికారులు సీజ్‌చేసినట్టు తెలిపారు. గత నెల 1న నుంచి కొనసాగుతున్న వాహనాల తనిఖీల్లో ఇప్పటి వరకూ 1381 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. వీటిపై 6.40 కోట్ల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేసినట్టు తెలిపారు. అలాగే టాక్సులు చెల్లించని వాహనాల నుంచి 27.70 కోట్లు వెరసి మొత్తం 34.10 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.
