వర్షం ఎఫెక్ట్.. డివైడర్ ను ఢీకొన్న బస్సు

వర్షం ఎఫెక్ట్.. డివైడర్ ను ఢీకొన్న బస్సు

హైదరాబాద్ : అబిడ్స్ జీపీవో చౌరస్తాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు డివైడర్ ను ఢీకొని ప్రమాదానికి గురైంది. సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బస్ అద్దాలు తడిసి రోడ్డు కనిపించకపోవడంతో డివైడర్ ను బస్సు డ్రైవర్ ఢీకొట్టాడు. హైదరాబాద్ నుండి కర్ణాటక మీదుగా మహారాష్ట్ర లోని నీలంగాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. బస్ కండక్టర్ కు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించి.. చికిత్స అందిస్తున్నారు. రోడ్డుకు మధ్యలో బస్సు నిలిచిపోవడంతో మొబైల్ క్రేన్ సహాయంతో అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు.