ఆర్టీసీలో డ్రైవర్ చేస్తానని.. రూ.8.6 లక్షలు గుంజిండు

ఆర్టీసీలో డ్రైవర్ చేస్తానని.. రూ.8.6 లక్షలు గుంజిండు
  • లారీ డ్రైవర్లకు కండక్టర్​ టోకరా

ఇబ్రహీంపట్నం , వెలుగు: తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ)లో డ్రైవర్ ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మించాడు. లక్షల రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేశాడు. తొమ్మిది నెలలైనా జాబ్‌ రాకపోవడంతో తమను మోసం చేసిన ఆర్టీసీ కండక్టర్ పై బాధితులు మంచాల పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన జి. శ్రీనివాస్ ముషీరాబాద్-1 ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. సంస్థలో తనకు మంచి పరిచయాలున్నాయని డ్రైవర్ ఉద్యోగాల్లో పెట్టిస్తానని, అందుకోసం కొంత ఖర్చు చేయాలని నమ్మబలికాడు. మొదట లోయపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌‌‌‌ ఆడెపు రాజు నుంచి రూ.48,000 వసూలు చేశాడు. ఇంకా17
ఖాళీలున్నా యని, ఎవరైనా ఉంటే రమ్మని కూడా చెప్పా డు. ఇది నమ్మిన లోయపల్లికి
చెందిన రాజు, హన్మం తు,ఎం.బుగ్గరాములు, రవి, రాజు, రమేష్, బుగ్గరాములు, ఖుదాభక్షపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు, గట్టు ప్పలకు చెందిన రవి, పుల్లెంల గ్రామానికి చెందిన సైదులుతో కలిపి మొత్తం 17 మంది రూ.8,62,000 గతేడాది ఏప్రిల్‌ లో చెల్లించారు.

తొమ్మిది నెలలైనా జాబ్‌ రాక పోవడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. తమకు న్యాయంచేయాలని మంచాల పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 420 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.