ప్రయాణికురాలిని రక్షించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్

 ప్రయాణికురాలిని రక్షించిన ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్

జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ , కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. నడవలేని స్థితిలో అనారోగ్యానికి గురైన మహిళను కాపాడారు. ఒక వైపు విధులు నిర్వర్తిస్తూనే..ప్రయాణికురాలిని రక్షించారు. మిషన్ కాంపౌండ్ వద్ద ఆర్టీసీ బస్సు దిగుతూ ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయింది. అక్కడున్నవారు ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వెంటనే స్పందించిన  డ్రైవర్,కండక్టర్ 108కి సమాచారం అందించారు. ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. 

ప్రయాణికులను బస్సుతో సహా అక్కడే వదిలిపెట్టి గాయపడిన ప్రయాణికురాలిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యం అందించి వచ్చే వరకు బస్సులోనే ప్రయాణికులు వేచి చూశారు. తన ప్రాణాలను రక్షించిన వారికి బాధితురాలు ధన్యవాదాలు తెలిపింది.  అస్వస్థతకు గురైన మహిళా ప్రయాణికురాలిని రక్షించిన కండక్టర్‌ రాంగోపాల్‌ వర్మ, డ్రైవర్‌ నవీన్‌ను డిపో అధికారులు అభినందించారు.