గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఖమ్మం జిల్లాలో ఆదివారం ఉదయం ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మరణించాడు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న sk.ఖాజామియా (55) హార్ట్ అటాక్ తో ప్రాణాలు వదిలాడు. 15 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మెలో యాక్టివ్ గా పాల్గొంటున్నాడని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.

సమ్మె పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో మనస్తాపానికి గురై ఒత్తిడిలో ఆయనకు గుండెపోటు వచ్చిందని ఖాజామియా కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఖాజా మియా స్వగ్రామం జగ్గయ్యపేట మండలం చందర్లపాడు. మృతుడి కుటుంబానికి RTC జేఏసీ, ప్రజా సంఘాల నాయకులు సంతాపం తెలిపారు.