టైలర్ గా కండక్టర్..మేస్త్రీగా డ్రైవర్: కూలి పనులకు పోతున్న ఆర్టీసీ ఉద్యోగులు

టైలర్ గా కండక్టర్..మేస్త్రీగా డ్రైవర్: కూలి పనులకు పోతున్న ఆర్టీసీ ఉద్యోగులు

మొన్నటిదాకా సీటు రింగ్ పట్టిన డ్రైవర్ ఇప్పుడు తాపీ పట్టుకుండు. టికెట్లు కొట్టిన కండక్టర్ మిషన్ కుడుతున్నారు. స్పానర్లు పట్టుకున్న మెకానిక్ లు వడ్రంగి పనులు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల గురించే దంతా. కరోనా వల్ల మేనేజ్ మెంట్ ఎక్కువ బస్సులు నడపడం లేదు. దీంతో నెలలో అన్ని రోజులు పని డటం లేదు. లీవ్ లు పెట్టుకోమని ఆఫీసర్లు చెబుతున్నారు. లీవ్స్ లేకుంటే ఆబ్సెంట్ వేస్తున్నారు. సగం జీతం కూడా అందని పరిస్థితుల్లో కూలి పనులకు పోతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.
అప్పట్లో రెండు నెలలపాటు ఆర్టీసీ సమ్మో కొనసాగింది.49 వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. మేనేజర్ మెంట్ రెండు నెలల పాటు జీతాలు నిలిపి వేసింది ఉద్యోగాలు ఉంటయో పోతయో తెల్వక ,జీతాలు రాక అప్పుడు నానా అవస్థలు పడ్డారు. ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది కూలి పనులు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటే పరిస్థితే ఆర్టీసీలో కనిపిస్తుంది. కరోనా తెచ్చిన తంటాకు తోడు ..ఆర్టీసీ మేనేజ్ మెంట్ తీరుతో అనేక మంది ఉద్యోగులు ఇతర పనులు చేసుకుంటున్నారు.

డ్యూటీలు దొరుకతలేవ్

లాక్ డౌన్ తో మార్చి 22 నుంచి మే 18 వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీలో మొత్తం 10 వేలకు పైగా బస్సులు ఉండగా ..సమ్మె తర్వాత 800 వరకు కాలం చెల్లి బస్సులను తగ్గించారు.లాక్ డౌన్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ,అంతరాష్ట్ర సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా6200 బస్సులను రెడీ చేశారు. కానీ ఆక్యుపెన్సీ తక్కువగా డటంతో సగం బస్సులు కూడా తిరగడం లేదు. దీంతో అనేక మంది డ్రైవర్లు ,కండక్టర్లు డిపోలకు వస్తున్నా పని ఇస్తలేరు. దీంతో అనేక డిపోల్లో ఆర్టీసీ అధికారులు లీవ్ గా పరిగణిస్తున్నారు..లీవ్ లు లేనోళ్లకు అబ్సెంట్ గా వేశారు. చాలా మందికి నెలలో సగం జీతం కూడా రావడం లేదు.

ఆర్థిక ఇబ్బందులు

జీతాలు సరిగా రాక కండక్టర్లు ,డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే మూడు నెలలు సగం జీతాలే వేశారు. దీంతో ఉద్యోగుల కుటుంబ పోషణ భారంగా మారింది. కనీసం రూమ్ రెంట్,ఫీజులు ,ఈఎంఐలు,చిట్టీలు కట్టడం లేదని, వాటి వడ్డీ పెరిగిపోతోందని పలువురు ఎంప్లాయిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం అప్పులు కూడా పుట్డడం లేదని వాపోతున్నారు.

పైసల్లేక వేరే పనులు

డ్యూటీలు ఇవ్వక, పని కోసం పోయినా లీవ్, ఆబ్సెంట్ వేస్తుండటంతో అనేక మంది ఉద్యోగాలు తాత్కాలికంగా వేరే పనులు చేసుకుంటున్నారు. వారంలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే డ్యూటీ వస్తోంది. డ్యూటీ ఉంటే పిలుస్తామని అధికారులే చెబుతున్నారు. దీంతో అనేక మంది వచ్చాన లీవ్, ఆబ్సెంట్ వేయించుకోవడం కంటే లీవ్ పెట్టి ఇంటి దగ్గర ఉండటం బెటర్ గా భావిస్తున్నారు. ఆబ్సెంట్ పడితే జీతం తక్కువగా వస్తుండటంతో చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు. కూరగాయలు అమ్మడం, కుట్టు మిషన్ ,పొలం పనులు, , మేస్త్రీ, వడ్రంగి ,తదితర పనులు చేసుకుంటున్నారు. వచ్చిన పైసలతో పూట వెళ్లదీస్తున్నారు.

జిల్లాల్లో మరిన్ని బస్సులు తగ్గింపు

జిల్లాల్లో తిరుగుతున్న బస్సుల సంఖ్యను మరింత తగ్గించారు. జిల్లాలో కేసులు పెరుగుతుండటంతో మేనేజ్ మెంట్ బస్సులను సగానికి తగ్గించింది. లాక్ డౌన్ తర్వాత,6200 బస్సులను సిద్ధం చేస్తే ఇటీవలి వరకు 4 వేల నుంచి 5 వేల వరకే నడిచాయి. ఇటీవల మరో 1500 బస్సులు తగ్గించారు. ఇందులో ప్రైవేట్ హైర్ బస్సులు ఎక్కువగా తగ్గించారు ప్రస్తుతం సుమారు2900 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో మరికొంత మంది డ్రైవర్లు, కండక్టర్లకు పని దొరకడం లేదు.