కాకా వెంకటస్వామికి భారతరత్న ఇవ్వాలె.. కాంగ్రెస్, మాల మహానాడు నేతలు

కాకా వెంకటస్వామికి భారతరత్న ఇవ్వాలె.. కాంగ్రెస్, మాల మహానాడు నేతలు

=సింగరేణి సంస్థను కాపాడిన ఘనత ఆయనది
=6న మంత్రి వివేక్​ వెంకటస్వామికి సన్మానం

గోదావరి ఖని: కార్మిక వర్గం కోసం ఎనలేని కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామికి భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్​ పార్టీ, మాల మహానాడు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. నష్టాల్లో కూరుకుపోయిన సింగరేణి సంస్థను కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదన్నారు. 

గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు బాబర్​ సలీం పాషా, గుమ్మడి కుమారస్వామి, మాల మహానాడు సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పలు దఫాలుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలిచి ప్రజలకు సేవలు అందిస్తున్న కాకా కుటుంబాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించాలన్నారు. 

మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తిరిగి తీసుకువచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. మార్కండేయ కాలనీలోని ఆర్​కే గార్గెన్​లో ఈ నెల 6న మంత్రి వివేక్​ వెంకటస్వామికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.