చెరువుల వద్ద పతంగుల పండుగ : హైడ్రా కమిషనర్ రంగనాథ్

చెరువుల వద్ద పతంగుల పండుగ : హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంక్రాంతికి బతుకమ్మకుంట, తమ్మిడికుంట, నల్ల చెరువు, బమ్-రుక్న్ -ఉద్-దౌలా చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్  ప్రకటించారు. బుధవారం మాదాపూర్ లోని తుమ్మిడికుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇప్పటికే బతుకమ్మకుంట చెరువు అందుబాటులోకి రాగా, మిగతా చెరువులు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 

సిబ్బందితో కలిసి పర్యటించిన ఆయన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. చెరువుల్లోకి మురుగు నీరు నేరుగా చేరకుండా, సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి జలాలు మాత్రమే వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చెరువుల చెంత పార్కుల అభివృద్ధి, గ్రీనరీ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతీ చెరువును పర్యాటక ప్రాంతంలా తీర్చిదిద్దుతామన్నారు.