వీరికి గుడ్ న్యూస్ : ఇప్పుడు సిమ్ అవసరం లేకుండా డబ్బులు పంపొచ్చు..

వీరికి గుడ్ న్యూస్ : ఇప్పుడు సిమ్ అవసరం లేకుండా డబ్బులు పంపొచ్చు..

ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు కొత్త మైలురాయిని సృష్టిస్తున్నాయి. దింతో భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గొప్ప పురోగతి సాధించింది, ఇది NRIలకు గుడ్ న్యూస్ కూడా. తాజాగా  RBI, NPCI ఇంకా  IDFC ఫస్ట్ వంటి కొన్ని బ్యాంకుల నుండి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా NRIలు ఇక పై భారతదేశంలో UPI చెల్లింపులు చేయడానికి విదేశీ మొబైల్ నంబర్లను ఉపయోగించవచ్చు. ఇందుకు భారతీయ SIM కార్డ్ కూడా అవసరం లేదు.

జనవరి 2023లో NRE లేదా NRO అకౌంట్స్  ఉన్న NRIలు  అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో UPIని ఉపయోగించవచ్చని RBI తెలిపింది. ఆ తర్వాత బ్యాంకులు, పేమెంట్స్ యాప్స్ దీనిని అంగీకరించడం ప్రారంభించాయి. 25 జూన్  2025న IDFC ఫస్ట్ బ్యాంక్ ఈ ఫీచర్‌ మొదట ప్రారంభించింది. ఇప్పుడు USA, UK, UAE, ఆస్ట్రేలియా, సింగపూర్‌తో సహా 12 దేశాల NRIలు విదేశీ ఫోన్ నంబర్‌లను ఉపయోగించి బ్యాంక్ అకౌంట్స్  UPI యాప్‌లకు లింక్ చేయవచ్చు.

ఈ ప్రయోజనాన్ని ఎలా పొందాలంటే :
ఈ ఫీచర్ యాక్టివేట్ చేయడానికి మీకు ఇండియన్ బ్యాంక్‌లో NRE లేదా NRO అకౌంట్ ఉండాలి. ఆమోదించిన లిస్టులో దేశ కోడ్ ఉన్న మొబైల్‌ నంబర్ ఉపయోగించండి. మీ UPI యాప్,  బ్యాంక్ అంతర్జాతీయ నంబరుకు సపోర్ట్  ఇవ్వాలి అని గుర్తుంచుకోండి.

ఏ దేశాలు అర్హులు: USA, UK, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, హాంకాంగ్, ఖతార్, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఒమన్, UAE ఉండగా, త్వరలో మరిన్ని దేశాలు ఈ లిస్టులో చేరనున్నాయి.

ఈ సౌకర్యాన్ని ఎలా పొందాలి: UPI (IDFC ఫస్ట్ లాగా)కు సపోర్ట్  చేసే భారతీయ బ్యాంకులో NRE లేదా NRO అకౌంట్  తెరవాలి. తరువాత మీ అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను బ్యాంకుకు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు PhonePe, Google Pay (ఇండియా వెర్షన్), BHIM లేదా Paytm వంటి UPI యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. తరువాత మీ అంతర్జాతీయ నంబర్‌ని ఉపయోగించి యాప్‌లో రిజిస్టర్  చేసుకోని,  OTP లేదా ఫింగర్ ప్రింట్ వెరిఫిఫై  చేయాలి. అయితే రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు బిల్స్  కట్టడానికి, QR కోడ్‌లను స్కాన్ చేయడానికి లేదా భారతదేశంలోనే  ఎవరికైన డబ్బు పంపడానికి UPIని ఉపయోగించవచ్చు.

ఏ యాప్స్ NRIలకు సపోర్ట్  చేస్తాయి: ఫోన్‌పే, గూగుల్ పే (ఇండియా వెర్షన్), భీమ్, పేటీఎం (సెలెక్ట్ చేసిన బ్యాంకులకి), అమెజాన్ పే. 

భారతదేశంలో NRE అకౌంట్లకు పన్ను విధించదు, కానీ NRO అకౌంట్లకు పన్ను విధించబడుతుంది. NRO అకౌంట్లోని  ఆదాయాల నుండి నేరుగా పన్ను వసూల్ చేయబడుతుంది (దీనినే TDS అంటారు). సెక్షన్ 206AA అనే ​​రూల్ ప్రకారం అధిక పన్ను చెల్లించకుండా ఉండటానికి మీరు మీ పాన్ కార్డును లింక్ చేయాలి. ఈ విధంగా ప్రతి UPI లావాదేవీలని భారత అధికారులు ట్రాక్ చేయవచ్చు.