ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పలు హోటళ్లు, చికెన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై సోమవారం సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. 12 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్విజిలెన్స్ డీఎస్పీ శేఖర్ రెడ్డి తెలిపారు. అధికారులతో ఓ చి కెన్ సెంటర్ నిర్వాహకుడు గొడవ పడగా ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ వచ్చి వివరాలు అడిగి తెలుసు కున్నారు. డీటీ కార్తీక్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
కోల్‌బెల్ట్: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని ఊరుమందమర్రికి వెళ్లే దారిలోని పాత భారత్‌గ్యాస్ గోదాం ఎదురుగా ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8 డొమెస్టిక్గ్యాస్సిలిండర్లను సివిల్ సప్లై ఆఫీసర్లు సీజ్‌చేశారు.
