IND VS ENG 2025: బస్‌లో వెళ్లకుండా ఒంటరిగా.. బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిన జడేజా

IND VS ENG 2025: బస్‌లో వెళ్లకుండా ఒంటరిగా.. బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిన జడేజా

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బీసీసీఐ విధించిన రూల్ ను బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో  ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ ప్లేయర్లపై కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక నియమాన్ని జడేజా ఉల్లంఘించినట్టు తేలింది. వివరాల్లోకెళ్తే.. బోర్డు తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. ఏ ఆటగాడూ స్వయంగా వేదికకు ప్రయాణించడానికి అనుమతించబడడు. అనగా జట్టుతో కలిసి బస్ లోనే వెళ్ళాలి. అది కూడా జట్టు మొత్తం కలిసి బస్ లోనే ప్రయాణించాలి. 

ALSO READ | IND VS ENG 2025: టీమిండియా కెప్టెన్ ఈజీ క్యాచ్ మిస్.. గిల్ తలకు తగిలిన బంతి

రిపోర్ట్స్ ప్రకారం జడేజా రెండో రోజు భారత జట్టు సభ్యుల కంటే చాలా ముందుగానే ఎడ్జ్‌బాస్టన్‌కు చేరుకున్నాడు. దీంతో అతను జట్టు బస్ లో కాకుండా విడిగా ప్రయాణించినట్టు అర్ధమవుతుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు అతనికి బీసీసీఐ జరిమానా విధించే అవకాశం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఎందుకంటే రెండో రోజు జడేజా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి అందరికంటే ముందుగా గ్రౌండ్ కు వచ్చినట్టు సమాచారం. జడేజా తన క్రమశిక్షణ తప్పలేదు. జట్టు కోసం ముందుగా బయలుదేరాడు. దీంతో అతనిపై బీసీసీఐ ఎలాంటి ఫైన్ విధించే అవకాశం లేనట్టు తెలుస్తుంది. 

ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన రెండో టెస్టులో 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా.. ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు టెస్ట్ ఛాంపియన్ లో 2000 పరుగులు పూర్తి చేయడానికి ఈ టీమిండియా ఆల్ రౌండర్ కు 79 పరుగులు అవసరం కాగా జడేజా 89 పరుగులు చేసి ఈ ఫీట్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో 89 పరుగులు చేసి టీమిండియా కెప్టెన్ గిల్ తో 203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాను ఆదుకున్నాడు.