హైదరాబాద్, వెలుగు: డీజిల్ పొదుపు చేయడాన్ని ఉద్యోగులు సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. డీజిల్‌ను ఆదా చేస్తూనే మైలేజీ పెంచుకునేందుకు సాంకేతిక పద్దతులను పాటించాలని సూచించారు.
శుక్రవారం బస్ భవన్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘ డీజిల్ నిర్వహణ..అవగాహన సదస్సు” కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇంధన సంక్షోభం, నిరంతరం పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో ప్రతీ డ్రైవర్ ఇంధన పొదుపుపై దృష్టిపెడితే సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లవచ్చాన్నారు.
