రూ.116 చెల్లిస్తే రాములోరి తలంబ్రాలు

రూ.116 చెల్లిస్తే రాములోరి తలంబ్రాలు

హైదరాబాద్, వెలుగు : శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే  సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను  భక్తుల ఇంటికే నేరుగా అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. నిరుడి మాదిరిగానే ఈసారి కూడా దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్లకు చేరవేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌‌ ఆర్టీసీ కార్గో పార్సిల్‌‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ ఎండీ సజ్జనార్  తెలిపారు. సీతారాముల కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తులకు హోం డెలివరీ చేస్తామని వెల్లడించారు.

బస్ భవన్ లో కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ ను అధికారులతో కలిసి ఎండీ ఆవిష్కరించారు. ఆర్టీసీ బిజినెస్​ హెడ్ (కార్గో) సంతోష్  కుమార్ రూ.116 చెల్లించి తలంబ్రాలను బక్ చేసుకొని, రసీదును ఎండీ నుంచి తీసుకున్నారు. ఎండీ మాట్లాడుతూ ఈసారి రాములోరి కల్యాణంతో పాటు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుందన్నారు.  ఈ సేవలను పొందాలనుకునే భక్తులు ఆర్టీసీ కార్గో  ఫోన్‌‌ నంబర్లు 91776 83134, 73829 24900, 91546 80020 నంబర్లను సంప్రదించాలన్నారు.