
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్హైదరాబాద్ పరిధిలోని లాంగ్రూట్లపై ఆర్టీసీ ఫోకస్పెట్టింది. తాజాగా కాచిగూడ రైల్వే స్టేషన్నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నాలుగు కొత్త బస్సులను(205 నంబర్) ప్రవేశపెడుతున్నట్టు గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి కొత్త బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. కాచిగూడ స్టేషన్ నుంచి జైల్గార్డెన్, సూపర్‌బజార్, దిల్సుఖ్నగర్, ద్వారకానగర్, ఎల్ బీనగర్ క్రాస్‌రోడ్స్, పనామా, భాగ్యలత, హయత్‌నగర్, ఎల్ఆర్పాలెం, పెద్దఅంబర్‌పేట, ఓఆర్ఆర్, అబ్దుల్లాపూర్‌మెట్ వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.