21 వేల బస్సులు అద్దెకు ఇచ్చాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్

21 వేల బస్సులు అద్దెకు ఇచ్చాం : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
  • సంస్థ ఆదాయం మెరుగుపడింది: ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 21 వేల ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వడంతో సంస్థ ఆదాయం మెరుగుపడిందని సంస్థ ఎండీ సజ్జనర్ తెలిపారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగిన రాష్ట్ర స్థాయి విలేజీ, కాలనీ ఆఫీసర్ల సమావేశానికి చీఫ్​గెస్టుగా హాజరైన సజ్జనర్.. ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. 

బతుకమ్మ, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సంస్థ ఆదాయం పెరిగేలా, అద్దె బస్సుల వ్యాపారం పెరిగేలా ఉద్యోగులు మరింత కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ ఇటీవల ప్రకటించిన టూర్ ప్యాకేజీలకు ప్రయాణీకుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఉద్యోగుల కృషి, పట్టుదల వల్లే సంస్థ ఆదాయం, ఆర్టీసీ బస్సులకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని సజ్జనార్ పేర్కొన్నారు.